విశాఖలో 108 అడుగుల ఆంజనేయ విగ్రహం

ABN , First Publish Date - 2021-12-09T04:44:59+05:30 IST

విశాఖ నగరంలో పేరొందిన సీతమ్మధార కొండపై భారీ హనుమాన్‌ విగ్రహం కొలువుదీరింది. హానుమాన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ 108 అడుగుల భారీ విగ్రహాన్ని బుధవారం పెందుర్తి శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పూజలు చేసి ప్రారంభించారు.

విశాఖలో 108 అడుగుల ఆంజనేయ విగ్రహం
108 అడుగుల ఆంజనేయ విగ్రహం

ప్రారంభించిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర

విశాఖపట్నం, డిసెంబరు 8: విశాఖ నగరంలో పేరొందిన సీతమ్మధార కొండపై భారీ హనుమాన్‌ విగ్రహం కొలువుదీరింది. హానుమాన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ 108 అడుగుల భారీ విగ్రహాన్ని  బుధవారం పెందుర్తి శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పూజలు చేసి ప్రారంభించారు. ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటైంది. తొలుత సీతమ్మధారలోని అభయాంజనేయస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు, హోమం నిర్వహించారు.


అనంతరం స్వామివారి పూజా సామగ్రితో కొండవద్దకు చేరుకుని భారీ విగ్రహానికి నివేదన చేశారు. అనంతరం విగ్రహాన్ని స్వాత్మానందేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహం భవ్యంగా ఉందని, విశాఖ నగరమంతా వాయుపుత్రుని పాదాల చెంత ఉందన్న అనుభూతి కలుగుతోం దని వ్యాఖ్యానించారు.


ప్రకృతి వైపరీత్యాల నుంచి విశాఖను ఇంతకాలం సింహాద్రి అప్పన్న, కనకమహాలక్ష్మి అమ్మవారు కాపాడుకుంటూ వచ్చారని, ఇకపై ఆంజనేయుని అభయం కూడా రక్షణగా నిలవబోతోందని తెలిపారు.విగ్రహ నిర్మాణం శుభపరిణామమని, ఇందుకోసం శ్రమించిన హనుమాన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆధ్యాత్మిక వేత్తలతోపాటు సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ, జగద్గురు పీఠం డైరెక్టర్‌ చింతలపాటి సత్యదేవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T04:44:59+05:30 IST