రైలు ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-01-14T05:09:54+05:30 IST

బూర్జుపాడుకు చెందిన రుద్రయ్యకు గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. పలాస రైల్వే జీఆర్‌పీ హెచ్‌సీ కోదండరావు కథనం మేరకు..

రైలు ఢీకొని యువకుడి మృతి
రుద్రయ్య(ఫైల్‌)


ఇచ్ఛాపురం, జనవరి 13: బూర్జుపాడుకు చెందిన  రుద్రయ్యకు గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. పలాస రైల్వే జీఆర్‌పీ హెచ్‌సీ కోదండరావు కథనం మేరకు.. బూర్జపాడుకు చెందిన పులకల నారాయణ, చంద్రావతి దంపతుల కుమారుడు పులకల రుద్ర య్య(24) బుధవారం ఇంటి నుంచి మధ్యాహ్నం భోజనం చేసి ఇచ్ఛాపురం చేరుకున్నాడు. రైలు నిలయం సమీపంలో ట్రాక్‌ దాటుతుండగా గుర్తుతెలియని రైలు ఢీకొని మృతి చెంది నట్లు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. రుద్రయ్య కవిటిలో డిగ్రీ చదువుతున్నాడు.కూలి పనులుచేసుకొని  తమ కుమారుడ్ని చదివిస్తున్నామని, ఏడాది కిందటే కూతుర్ని వివాహం చేశామని ఈ నేప థ్యంలో కుమారుడు మృతితో  తల్లిదండ్రులు రోదిస్తున్నారు.

 

Updated Date - 2021-01-14T05:09:54+05:30 IST