ఉప్పుటేరులో దూకి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-21T05:45:39+05:30 IST

ఉప్పుటేరులో దూకి యువకుడి ఆత్మహత్య

ఉప్పుటేరులో దూకి యువకుడి ఆత్మహత్య

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 20:  నువ్వాలారేవు ఉప్పుటేరులో దూకి చిన్నపల్లెవోరు గ్రామానికి చెందిన గర్తం సంజయ్‌ (27) అనే యువకుడు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్‌ఐ గోవిందరావు చెప్పారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీంచామన్నారు. గజఈతగాళ్లు సాయంతో ఉప్పుటేరులో వెతికిస్తున్నట్టు తెలిపారు. కాగా సంజయ్‌ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


అత్యాచారం కేసు విచారణ

సారవకోట (జలుమూరు) ఆగస్టు 20: అత్యాచారం కేసుకు సంబంధించి పాలకొండ డీఎస్పీ శ్రావణి శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. సారవకోట మండలంలోని ఓ గ్రామంలో దివ్యాంగురాలిపై యువకుడు అత్యాచారం చేసినట్టు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘాతుకానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా డీఎస్పీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలను తెలుసుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డీఎస్పీ వెంట ఎస్‌ఐ ముకుందరావు ఉన్నారు. 

 


Updated Date - 2021-08-21T05:45:39+05:30 IST