విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2021-11-21T05:57:03+05:30 IST
తొలుసూరుపల్లి రోడ్డులో భవన నిర్మాణ పనులు చేపడుతున్న కార్మికుడు శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

టెక్కలి రూరల్, నవంబరు 20: తొలుసూరుపల్లి రోడ్డులో భవన నిర్మాణ పనులు చేపడుతున్న కార్మికుడు శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. టెక్కలి మండలం కె కొత్తూ రుకు చెందిన కోనారి అప్పయ్య, రాములమ్మ భార్యాభర్తలు. పట్టణంలోని తొలుసూరుపల్లి రోడ్డులో ఓ భవన నిర్మాణ పనికి శనివారం వచ్చారు. అయితే అప్పయ్య (61) రెండో అంతస్తుకు పనికి వెళ్తున్న సమయంలో సమీపంలోని విద్యుత్ తీగలు తగిలి అక్కడి నుంచి కింద పడిపోయాడు. ఈ సంఘటనను భార్యతో పాటు ఇతర కార్మికులు గమనించి అతడిని చూసేసరికి అప్పటికే మృతిచెందడంతో బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.