లక్ష్యసాధన దిశగా పనిచేయండి

ABN , First Publish Date - 2021-07-13T05:13:32+05:30 IST

లక్ష్యసాధన దిశగా పనిచేయాలని కలెక్టర్‌ శ్రీకేశ్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులపై సోమవారం కలెక్టర్‌ కార్యా లయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

లక్ష్యసాధన దిశగా పనిచేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

కలెక్టరేట్‌, జూలై 12: లక్ష్యసాధన దిశగా పనిచేయాలని కలెక్టర్‌ శ్రీకేశ్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులపై సోమవారం కలెక్టర్‌ కార్యా లయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనుల్లో జాప్యమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి చూపని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కంచిలి పంచాయతీరాజ్‌ డీఈ ఆధ్వర్యంలో 238 పనులు మంజూరు కాగా, 220 పనులు ప్రారంభించారు. వీటిలో 20 శాతం పనులు మాత్రమే పూర్తి కావడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. టెక్కలి డివిజన్‌లో పనుల  ప్రగతి తక్కువగా ఉం దంటూ మండిపడ్డారు. నందిగాం మండలంలోని నాలుగు గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పనుల ప్రగతి కనిపించాలని, లేకపోతే  సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధుల వినియోగంలో వెనుకబడి ఉన్నామని, ఈ విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. జిల్లాకు రూ.60కోట్ల విలువైన పనులు మంజూరయ్యా యని, వీటిని సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఉపాధిహామీ వెబ్‌సైట్‌లో ప్రగతిని ఇంజినీర్లు పరిశీలించా లని సూచించారు.  సమస్యలు అధిగమించి లక్ష్యాలు సాధిం చాలని తెలిపారు.  కార్యక్రమంలో జేసీ ఆర్‌ శ్రీరాములు నాయుడు, డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు జడ్పీ సీఈవో బి. లక్ష్మీపతి, పంచాయితీరాజ్‌ ఎస్‌.ఈ.కె. బ్రహ్మయ్య తదిత రులు పాల్గొన్నారు. Updated Date - 2021-07-13T05:13:32+05:30 IST