ఏడాదిగా ఏం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2021-11-24T05:17:37+05:30 IST

నులకజోడు, వడ్డంగిలో సచివాలయ పనులు ఏడాదిగా నిలిచిపో వడంపై కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏడాదిగా ఏం చేస్తున్నారు?
అధికారులను ప్రశ్నిస్తున్న కలెక్టర్‌

 సచివాలయాల పనులు నిలిచిపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం

భామిని: నులకజోడు, వడ్డంగిలో సచివాలయ పనులు ఏడాదిగా నిలిచిపో వడంపై కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ  లఠ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. మంగళవారం నులకజోడు, వడ్డంగి సచివాలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయాల ద్వారా అందుతున్న సేవలపై ఆరాతీశారు. పలువురు పూర్తిస్థాయిలో సేవలు అందడంలేదని ఫిర్యాదుచేయడంతో అసహనం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లకుండా సచి వాలయాల్లోనే ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. నులకజోడులో సచివాల య పనులు పరిశీలించారు. అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఏడాదిగా  అధికారులు ఏం చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథ కంపై ఎంత మంది లబ్ధిదారులను గుర్తించారో తెలుసుకున్నారు. వడ్డంగిలో అర్ధాంత రంగా నిలిచిపోయిన భవనాన్ని పరిశీలించారు. పీఆర్‌ జేఈ గైర్హాజరుకావడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా  నులకజోడు, వడ్డంగి, భామినిలో పలువురు సమస్య లు కలెక్టర్‌కు వివరించారు. ఆయనతో పాటు మండల ప్రత్యేకాధికారి ప్రసాద్‌, తహసీ ల్దార్‌ ఆర్‌.రంజిత్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ జేఈ భాస్కరరావు, హౌసింగ్‌ ఏఈ చంద్ర శేఖర్‌, ఈవోఆర్‌డీ కృష్ణారావు పాల్గొన్నారు.


 


Updated Date - 2021-11-24T05:17:37+05:30 IST