ఏమైందో.. ఏమో?

ABN , First Publish Date - 2021-10-15T05:19:01+05:30 IST

భావనపాడు సము ద్రతీరంలో గురువారం ఒడిశా కు చెందిన సిరిపురం ఉచిత (21) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

ఏమైందో.. ఏమో?

 సముద్రతీరంలో యువతి ఆత్మహత్య       

సంతబొమ్మాళి, అక్టోబ రు 14:  భావనపాడు సము ద్రతీరంలో గురువారం ఒడిశా కు చెందిన సిరిపురం ఉచిత (21) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివ రాల ప్రకారం.. పర్లాకిమిడి దరి దవిడగాం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్‌ బెలుమడ కి చెందిన ఉచితల మధ్య కొన్నే ళ్లుగా ప్రేమ వ్యవహారం నడు స్తుంది.అయితే దుర్గాప్రసాద్‌కు ఐదేళ్ల కిందటే  వేరొకరితో వివాహమైంది.  ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఉచిత, దుర్గాప్రసాద్‌ ప్రేమించు కుంటున్నారు. ఈ నేపఽథ్యంలో గురువారం వారు భావనపా డు సముద్రతీరానికి బైక్‌పై వచ్చారు. సముద్ర స్నానం అనంతరం వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉచిత తన బ్యాగ్‌లోని పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసు కుందని ప్రియుడు దుర్గాప్రసాద్‌ పోలీసులు, స్థానికులకు  చెప్పాడు. కాగా ఉచిత ఎలా మృతి చెందిందన్న విషయం అనుమానాస్పదంగా మారింది. నౌపడ ఎస్‌ఐ సాయికు మార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-10-15T05:19:01+05:30 IST