చోరీ కేసును ఛేదిస్తాం : ఏఎస్పీ

ABN , First Publish Date - 2021-10-30T05:15:32+05:30 IST

చోరీ కేసును ఛేదిస్తాం : ఏఎస్పీ

చోరీ కేసును ఛేదిస్తాం : ఏఎస్పీ
మాట్లాడుతున్న ఏఎస్పీ విఠలేశ్వరరావు

ఇచ్ఛాపురం: పురపాలక సంఘ పరిధి చక్రపాణివీధి మల్లెడి రామిరెడ్డి ఇంట్లో జరిగిన చోరీ కేసును త్వరలోనే ఛేదించి నిందితులను పట్టుకుంటామని ఏఎస్పీ విఠలేశ్వరరావు అన్నారు. శుక్రవారం చోరీ జరిగిన ప్రాం తాన్ని పరిశీలించారు. ఈ సంద ర్భంగా రామిరెడ్డి వద్ద పని చేస్తున్న సుమారు 20మంది వర్కర్లను విచారించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ... గురువారం వేకువ జామున రూ.16.57 లక్షలు విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయన్నారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నట్టు తెలిపారు. ఇంట్లో ఉన్న కెమెరాలను పగలుగొ ట్టారని, దీనిబట్టి ఈ ఇంటి పరిసరాలు తెలిసినవారే ఈ చోరీకి పాల్పడినట్టు భావి స్తున్నామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటా మన్నారు. సీఐ ఎం.వినోద్‌బాబు, పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-10-30T05:15:32+05:30 IST