ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటాం

ABN , First Publish Date - 2021-11-02T05:32:27+05:30 IST

విశాఖ ఉక్కు అమరువీరుల పోరాటం వృథా కానివ్వ బోమని, కర్మా గారాన్ని కాపాడుకుంటామని ఏఐ ఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. సోమవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు మౌనం పాటించారు.

ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటాం
నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘ నేతలు

కాశీబుగ్గ: విశాఖ ఉక్కు అమరువీరుల పోరాటం వృథా కానివ్వ బోమని, కర్మా గారాన్ని కాపాడుకుంటామని ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. సోమవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు మౌనం పాటించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి మానవ హారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1966 నవంబరు ఒక టోతేదీన విశాఖ ఉక్కు కర్మాగారం కోసం నిర్వహించిన పోరాటంలో జరిగిన కాల్పు ల్లో 11 మంది విద్యా ర్థులు అమరులయ్యారని గుర్తు చేశారు. నేటికి ఆ సంఘటన జరిగి 55 ఏళ్లు పూర్తయిందన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు రవి, గిరి, వెంకటరమణ, వేణుగోపాల్‌  పాల్గొన్నారు.

 

Updated Date - 2021-11-02T05:32:27+05:30 IST