మాదకద్రవ్యాల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాం

ABN , First Publish Date - 2021-10-20T05:04:59+05:30 IST

మాదకద్రవ్యాల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాం

మాదకద్రవ్యాల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాం

 టీడీపీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రవికుమార్‌

శ్రీకాకుళం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించే వరకూ టీడీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ జిల్లా పార్లమెంటరీ   నియో జకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, గంజాయి సాగు, రవాణాపై టీడీపీ పెద్దఎత్తున ఉద్యమిస్తుందన్నారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు. ప్రభుత్వానికి చేతనైతే రాష్ట్రంలో గంజాయి సాగును కట్టడి చేయాలని హితవుపలికారు. నర్సీపట్నం పోలీసులు వారి ప్రాంతంలో గంజాయి సాగును అరికట్టలేకపోగా.. గుంటూరులో ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రికి నోటీసులు జారీ చేయడమేంటన్నారు. టీడీపీ నాయకులకు నోటీసులు ఇవ్వడంలో  పోలీసులకు ఉన్న శ్రద్ధ గంజాయి సాగు, రవాణాను అరికట్టడంపై ఉంటే బాగుంటుందన్నారు. అధికారంలో ఉన్నవారు చెప్పినంత మాత్రాన తొందర పడితే భవిష్యత్‌లో పోలీసులు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. 

Updated Date - 2021-10-20T05:04:59+05:30 IST