పంచాయతీ అభివృద్ధిలో వార్డుసభ్యులే కీలకం
ABN , First Publish Date - 2021-10-28T05:58:25+05:30 IST
పంచాయతీ అభివృద్ధిలో వార్డుసభ్యులే కీలకం

- రాష్ట్ర పరిశీలకుడు శశిభూషణరావు
నందిగాం : పంచా యతీల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని రాష్ట్ర పరిశీలకులు శశి భూషణరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి ప్రారంభించారు. ఎంపీపీ మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగపర్చుకొని వార్డుల్లో సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వార్డుసభ్యులకు యోగా తరగతి నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు కె.బాలకృష్ణారావు, ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్, ఏవో ఆర్.సుధారాణి, పంచాయతీ కార్యదర్శులు పి.ఆనందరావు, కె.రమణబాబు, సంతోష్‌కుమార్ ఉన్నారు.
భాగస్వాములు కావాలి
టెక్కలి రూరల్ : గ్రామాభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎంపీపీ సరోజినమ్మ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బధవారం వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులో పాల్గొని మాట్లాడారు. అక్కవరం, బొప్పాయిపురం, అయోధ్యపురం, భగవాన్‌పురం, బన్నువాడ, బూరగాం, గూడెం, లింగాలవలస, వేఘవరం పంచాయతీల్లోని వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. వైస్‌ఎంపీపీ పి.రమేష్, ఎంపీడీవో రమణమూర్తి ఉన్నారు.