కరోనా నుంచి దేశాన్ని రక్షించాలని కోరుకుంటూ.. శివస్వామి సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2021-12-20T04:52:47+05:30 IST

కరోనా నుంచి దేశ రక్షించాలని కోరుకుంటూ అనంత పురం జిల్లాకు చెందిన శివస్వామి చేపట్టిన సైకిల్‌ యాత్ర ఆదివారం గొప్పిలి గ్రామానికి చేరుకుంది. కరోనా మహమ్మారి వల్ల లక్షలాది మంది మృతి చెందరని, భవిష్యత్‌లో దీనివల్ల ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండాలని ముఖ్య ఆలయాలను దర్శించుకుని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

కరోనా నుంచి దేశాన్ని రక్షించాలని కోరుకుంటూ..  శివస్వామి సైకిల్‌ యాత్ర
గొప్పిలిలో మాట్లాడుతున్న శివస్వామి

మెళియాపుట్టి, డిసెంబరు 19: కరోనా నుంచి దేశ రక్షించాలని కోరుకుంటూ అనంత పురం జిల్లాకు చెందిన శివస్వామి చేపట్టిన సైకిల్‌ యాత్ర ఆదివారం గొప్పిలి గ్రామానికి చేరుకుంది. కరోనా మహమ్మారి వల్ల లక్షలాది మంది మృతి చెందరని, భవిష్యత్‌లో దీనివల్ల ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండాలని ముఖ్య ఆలయాలను దర్శించుకుని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సైకల్‌ యాత్ర చేపట్టి  67 రోజు లు గడుస్తోందన్నారు. సైకిల్‌పై జమ్మూ-కాశ్మీర్‌ వెళ్లి తిరిగి తమిళనాడు రాష్ట్ర రామేశ్వరం వద్ద యాత్ర ముగించుకుని శ్రీలంక దేశానికి పడవలో ప్రయాణించి అక్కడి నుంచి కోనేశ్వర ఆలయంలో పూజలు చేసి తిరిగి ఇంటికి వస్తానని ఆయన పేర్కొన్నారు. 

 

Updated Date - 2021-12-20T04:52:47+05:30 IST