పల్లెకు సంక్రాంతి

ABN , First Publish Date - 2021-01-13T05:27:45+05:30 IST

పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. హరిదాసుల సందడి, చెంచుల నృత్యాలు, జంగాల పొగడ్తలు, రంగవల్లులతో గ్రామాల్లో సందడి నెలకొంది. వలసదారుల రాకతో వీధులు కళకళలాడుతున్నాయి.

పల్లెకు సంక్రాంతి
నరసన్నపేట మార్కెట్‌లో వస్త్రాలు కొనుగోలు చేస్తున్న దృశ్యం


  గ్రామాల్లో సందడి వాతావరణం

  స్వస్థలాలకు చేరుకుంటున్న వలసదారులు

 పొగడ్తలతో ముంచెత్తుతున్న బేడ జంగాలు

 ఆకట్టుకుంటున్న చెంచుల విన్యాసాలు

(ఎచ్చెర్ల/ఎల్‌.ఎన్‌.పేట/ నరసన్నపేట)

  పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. హరిదాసుల సందడి, చెంచుల నృత్యాలు, జంగాల పొగడ్తలు, రంగవల్లులతో గ్రామాల్లో సందడి నెలకొంది. వలసదారుల రాకతో వీధులు కళకళలాడుతున్నాయి. సాధారణంగా సంక్రాంతి పర్వదినాల్లో పెద్దలకు (చనిపోయిన వారిని) పూజించడం ఆనవాయితీ. అలాగే సంక్రాంతి రోజున పెద్దల పేరిట పొత్తర్లను బ్రాహ్మణులకు అందజేస్తారు. ఇది తెలుగు ప్రజల సంప్రదాయం. పొత్తర్లను ఇచ్చిన తర్వాతనే మిగిలిన కార్యక్ర మాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా బేడ జంగాలు ఇంటింటికీ వెళ్లి చని పోయిన పెద్దలను కీర్తిస్తున్నారు. ఒక చేతితో గంట పట్టుకొని మరో చేతితో స్వయంపాకం అందుకుంటున్నారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగి స్తున్న బేడ జంగాల కులస్థులు ధనుర్మాసం నెల రోజులు ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత ఆర్థికపరంగా ఇబ్బందులేనని గంధం తారకేశ్వరరావు (మురపాక) ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. శివాలయాల్లో అర్చకులుగా జీవనం సాగి స్తుంటామన్నారు. అలాగే బొంతలు కుడుతూ కాలం నెట్టుకొస్తున్నారు. భవిష్యత్‌ తరాలవారు కులవృత్తిని కొనసాగించడం కష్టమేనని అభిప్రాయ పడ్డారు. మహిళలు వాకళ్లను గొబ్బమ్మలు, ముత్యాల ముగ్గులతో అందంగా అలంక రిస్తున్నారు. చెంచులు నృత్యాలు చేస్తుండగా గంగిరెద్దుల ఆటలతో పల్లెల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.  జిల్లాలోని వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కళకళ లాడుతున్నాయి. కిరా ణా, చెప్పుల షాపులు రద్దీగా కనిపిస్తున్నాయి. సంకాంత్రి సందర్భంగా చాలా గ్రామాల్లో ఆటలు పోటీలు నిర్వహిస్తున్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ పోటీలతో క్రీడా సందడి కనిపిస్తుంది.

 

Updated Date - 2021-01-13T05:27:45+05:30 IST