మంత్రి వ్యాఖ్యలపై వీఆర్వోల నిరసన
ABN , First Publish Date - 2021-12-02T05:11:13+05:30 IST
వీఆర్వోలను కించపరిచేలా మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం నరసన్నపేట, జలుమూరు, పాలకొండలలో వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
నరసన్నపేట/జలుమూరు/పాలకొండ: వీఆర్వోలను కించపరిచేలా మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం నరసన్నపేట, జలుమూరు, పాలకొండలలో వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. సచివాలయానికి వీఆర్వోలు వస్తే తరిమేయాలని ఎంపీటీసీలు, సర్పంచ్లను కోరడం దారుణమన్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం సేవలందించే వీఆర్వోలపై మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని వీఆర్వోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెళ్ల అప్పల నాయుడు, జిల్లా అధ్యక్షుడు వేణు గోపాలరావు అన్నారు. కార్యక్రమంలో మూడు మండలాల వీఆర్వోలు పాల్గొన్నారు.