ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా వేణుగోపాల్‌

ABN , First Publish Date - 2021-02-27T05:13:47+05:30 IST

సామాజిక ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ఎన్‌.వేణుగోపాల్‌ను నియమిస్తూ కలెక్టరు జె.నివాస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ‘సెక్యూరిటీ గార్డు.. వైద్యుడి అవతారం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ లో గురువారం ప్రచురితమైన కథనంపై వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ బాటమనేని భాస్కరరావు స్పందిస్తూ ఉత్తర్వులు జారీ సంగతి తెలిసిందే.

ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా వేణుగోపాల్‌


రాజాం రూరల్‌, ఫిబ్రవరి 26: సామాజిక ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ఎన్‌.వేణుగోపాల్‌ను నియమిస్తూ కలెక్టరు జె.నివాస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ‘సెక్యూరిటీ గార్డు.. వైద్యుడి అవతారం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ లో గురువారం ప్రచురితమైన కథనంపై వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ బాటమనేని భాస్కరరావు స్పందిస్తూ ఉత్తర్వులు జారీ సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల మేరకు మహం తి చంద్రశేఖరనాయుడును సస్పెండ్‌ చేస్తూ ఆ బాధ్యతలను వేణుగోపాల్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శనివారం తాను బాధ్యతలు స్వీకరిస్తానని వేణుగోపాల్‌ పేర్కొన్నారు. 

 

Updated Date - 2021-02-27T05:13:47+05:30 IST