విద్యుత్ ఆధారిత ఇంధనాన్ని వాడండి
ABN , First Publish Date - 2021-12-16T04:51:52+05:30 IST
విద్యుత్ ఆధారిత ఇంధనాన్ని పొదుపుగా వాడడం ద్వారా జాతీయ స్థాయిలో రూ.వేల కోట్లు ఆదా అవుతుందని, భవిష్యత్ తరాలకు కావాల్సిన సంపద నిక్షిప్తం చేసినట్లువుతుందని టెక్కలి ట్రాన్స్‌కో డీఈఈ జీఎన్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆదిత్య ఇంజి నీరింగ్ కళాశాలలో జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల సందర్భంగా అవ గాహన సదస్సు నిర్వహించారు.

కె.కొత్తూరు (టెక్కలి), డిసెంబరు 15: విద్యుత్ ఆధారిత ఇంధనాన్ని పొదుపుగా వాడడం ద్వారా జాతీయ స్థాయిలో రూ.వేల కోట్లు ఆదా అవుతుందని, భవిష్యత్ తరాలకు కావాల్సిన సంపద నిక్షిప్తం చేసినట్లువుతుందని టెక్కలి ట్రాన్స్‌కో డీఈఈ జీఎన్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆదిత్య ఇంజి నీరింగ్ కళాశాలలో జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల సందర్భంగా అవ గాహన సదస్సు నిర్వహించారు. ఓల్టేజీ అవసరం, ఆర్థిక స్థోమతను బట్టి సోలార్ రూప్‌టాప్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు, డీన్ డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన అంతర్జాతీయ సదస్సు
ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ముగిసిందని డైరెక్టర్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ దేశాల నుంచి పరిశోధకులు వివిధ అంశాలపై వర్చువల్‌గా చర్చించారన్నారు. 256 పరిశోధనాత్మక పేపర్లు పలువురు అందజేయగా 56 పేపర్లను నిష్ణాతులు ఎంపిక చేశారన్నారు.