నిల్వ చేయలేక... మద్దతు ధర దొరక్క!

ABN , First Publish Date - 2021-12-26T05:42:23+05:30 IST

నిల్వ చేయలేక... మద్దతు ధర దొరక్క!

నిల్వ చేయలేక... మద్దతు ధర దొరక్క!

నరసన్నపేట : ఆరుగాలం కష్టబడి పంటలు సాగు చేస్తున్న అన్నదాతకు అవస్థలు తప్పడంలేదు. వరి పంట చేతికొస్తున్న సమయంలో మద్దతు ధర లేకపోవడంతో దళారులకు విక్రయించాల్సివస్తోంది. ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు అంతంత మాత్రంగానే ఉండడంతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారు. జిల్లాలో వందల టన్ను ల్లో ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులు లెక్కలు చూపుతుండగా... మిల్లులకు మాత్రం వేల టన్నులు ధాన్యం చేరుతున్నాయంటే రైతుల దీన స్థితిని అర్ధం చేసుకోవచ్చు. దీంతో రైతు మిల్లుల వద్ద ఇలా ధాన్యం బస్తాలతో వాహనాలు బారులు తీరుతున్నాయి. 

Updated Date - 2021-12-26T05:42:23+05:30 IST