బౌద్ధ క్షేత్రంపై త్రివర్ణ కాంతులు

ABN , First Publish Date - 2021-10-15T04:16:08+05:30 IST

శాలిహుండం కొండపై ఉన్న బౌద్ధక్షేత్రం గురువారం సాయంత్రం త్రివర్ణ కాంతులతో ధగధగా మెరిసిపోయింది. దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 100 కోట్లకు చేరుకుంటున్న సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బౌద్ధక్షేత్రం వద్ద అశోక ధర్మచక్రం రాతికట్టడం చుట్టూ జాతీయ పతాకంలోని రంగులతో విద్యుత్‌ దీపాలను అమర్చారు.

బౌద్ధ క్షేత్రంపై త్రివర్ణ కాంతులు

 అద్భుత దృశ్యాన్ని తిలకించిన ప్రజలు

 నేడు, రేపు కూడా విద్యుత్‌ వెలుగులు

శాలిహుండం (గార), అక్టోబరు 14: శాలిహుండం కొండపై ఉన్న బౌద్ధక్షేత్రం గురువారం సాయంత్రం త్రివర్ణ కాంతులతో ధగధగా మెరిసిపోయింది. దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 100 కోట్లకు చేరుకుంటున్న సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బౌద్ధక్షేత్రం వద్ద అశోక ధర్మచక్రం రాతికట్టడం చుట్టూ జాతీయ పతాకంలోని రంగులతో విద్యుత్‌ దీపాలను అమర్చారు.  ఈ దృశ్యాలను డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారు. ఈ అద్భుత దృశ్యాన్ని ప్రజలు వీక్షించి..పులకించిపోయారు. పురావస్తుశాఖ సీనియర్‌ సీఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జిల్లా పర్యాటకశాఖ అధికారి నారాయణరావు, గీతా ఫౌండేషన్‌ చైర్మన్‌ గీతాశ్రీకాంత్‌, ఎన్‌సీఏఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వరదరాజులు తదితరులు  బౌద్ధక్షేత్రాన్ని సందర్శించారు. శుక్ర, శనివారాల్లో కూడా విద్యుత్‌ కాంతులు ఉంటాయని, సందర్శకులు వీక్షించవచ్చునని సీనియర్‌ సీఏ శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - 2021-10-15T04:16:08+05:30 IST