సచివాలయాలతో పారదర్శక పాలన

ABN , First Publish Date - 2021-08-22T05:26:05+05:30 IST

సచివాలయాలతోనే గ్రామాల్లో ప్రజలకు పారదర్శక పాలన లభిస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మందస మండలం నారాయణపురంలో నిర్మించిన సచివాలయం, ఆర్బీకేలను శనివారం ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సచివాలయాలతో పారదర్శక పాలన
సచివాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అప్పలరాజు

హరిపురం: సచివాలయాలతోనే గ్రామాల్లో ప్రజలకు పారదర్శక పాలన లభిస్తుందని మంత్రి  సీదిరి అప్పలరాజు అన్నారు. మందస మండలం నారాయణపురంలో నిర్మించిన సచివాలయం, ఆర్బీకేలను శనివారం  ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అగ్గున్న సూర్యారావు, అందాల శేషగిరి, తేజేశ్వరరావు పాల్గొన్నారు.


‘లోపాలను సహించేది లేదు’

రేగిడి: సచివాలయాల నిర్వహణలో లోపాలను సహించేది లేదని, ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శకంగా సేవలు అందించాలని ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవోఎస్‌ రఘునాథ్‌ ఆచారి ఆదేశించారు. కొమిరి, మునకల వలస, తొకలవలస సచివాలయాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. వారితో పాటు ఉపాధి హామీ ఇంజినీరింగ్‌ అధికారి రామకృష్ణ ఉన్నారు. 

 

Updated Date - 2021-08-22T05:26:05+05:30 IST