జిల్లాలో 85 మల్టీపర్పస్‌ కేంద్రాలు

ABN , First Publish Date - 2021-12-26T05:44:41+05:30 IST

జిల్లాలో 85 మల్టీపర్పస్‌ కేంద్రాలు

జిల్లాలో 85 మల్టీపర్పస్‌ కేంద్రాలు
Scene of flattening space on the premises of Pogiri Leprosy Hospital

- మార్కెటింగ్‌ శాఖ డీఈఈ పోతయ్య

రాజాం : జిల్లాలో 85 మల్టీపర్పస్‌ స్పెషాలిటీ కేంద్రాలు మంజూరైనట్టు మార్కెటింగ్‌ శాఖ డీఈఈ దాసరి పోతయ్య తెలిపారు. శనివారం పొగిరి లెప్రసీ కేంధ్రం ఆవరణలో జరుగుతున్న నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మల్టీపర్పస్‌  కేంద్రాల వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. పండించిన పంటలు దాచుకునేందుకు, తడిచిన పంటలను ఆరబెట్టుకునేందుకు ఇలా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఒక్కో కేంద్రం సామర్థ్యం 500 టన్నులు నుంచి 1000 టన్నుల వరకు ఉంటుంద న్నారు. వెయ్యి టన్నుల కేంద్రం నిర్మాణానికి రూ.80లక్షలు, 500 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం నిర్మాణానికి రూ.40 లక్షలు చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు  అయితే తొలి విడతగా జిల్లాలో 34 కేంద్రాల పనులు ప్రారంభిస్తామన్నారు. మిగిలిన 51 కేంద్రాలు విడతలో చేపడతామన్నారు. అన్ని కేంద్రాల నిర్మాణానికి అవసరమైన స్థలాలు గుర్తించామన్నారు. త్వరలోనే వీటి నిర్మాణం పనులు చేపడతామన్నారు.

Updated Date - 2021-12-26T05:44:41+05:30 IST