జాతీయ రహదారిపై చోరీ

ABN , First Publish Date - 2021-08-11T04:56:38+05:30 IST

జాతీయ రహదారిపై చోరీ

జాతీయ రహదారిపై చోరీ

- పోలీసులను ఆశ్రయించిన లారీ డ్రైవర్‌
భోగాపురం :
భోగాపురం జాతీయరహదారిపై ఆగిఉన్న లారీ డ్రైవర్‌ నుంచి నగదు, సెల్‌ఫోన్‌ చోరీకి గురైనట్టు ఎస్‌ఐ యు.మహేష్‌ మంగళవారం తెలిపారు. భోగాపురం ఎత్తుబ్రిడ్జి డౌన్‌హోటల్‌ వద్ద సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జ రిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ టైర్‌ పంక్చర్‌ అయింది. దీంతో నర్సీపట్నం సమీప మాకవరం గ్రామానికి చెందిన డ్రైవర్‌ చింతకాయల రామ్‌గణేష్‌ టైర్‌ పరిశీలిస్తుండగా... గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ద్విచ వాహనంపై వచ్చి డ్రైవర్‌ నుంచి రూ.19,800 నగదుతోపాటు సెల్‌ఫోన్‌ బలవం తంగా లాక్కుని వెళ్లిపోయారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధా రంగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2021-08-11T04:56:38+05:30 IST