అన్నిరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-08-28T05:11:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గౌతు శిరీష విమర్శించారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... రెండున్న రేళ్ల పాలనలో అప్పులు తీసుకురావడంలో తప్పా అభివృద్ధిలో వైఫల్యం చెందిందని, ఎన్నికల్లో ఇప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

అన్నిరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
కాశీబుగ్గలో కామేశ్వరరావును పరామర్శిస్తున్న గౌతు శిరీష

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

అధిక ధరలకు వ్యతిరేకంగా నేడు నిరసన 

పలాస, ఆగస్టు 27: రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గౌతు శిరీష విమర్శించారు. శుక్రవారం  స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... రెండున్న రేళ్ల పాలనలో అప్పులు తీసుకురావడంలో తప్పా అభివృద్ధిలో వైఫల్యం చెందిందని, ఎన్నికల్లో ఇప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిత్యావసర సరకుల ధరలు సామాన్యుడికి అందనంత స్థాయిలో ఉన్నాయని, అవేమీ ప్రభుత్వానికి పట్టక పోవడం దురదృష్టకరమన్నారు. అధిక ధరలపై ప్రజాగళం ప్రభుత్వానికి వినిపించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శనివారం చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉద యం 9 గంటలకే స్థానిక పార్టీ కార్యాలయానికి చేరుకోవాలన్నారు. 


టీడీపీ నాయకుడికి పరామర్శ

కాశీబుగ్గ : అనారోగ్యానికి గురై కోలుకుంటున్న పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు లొడగల కామేశ్వరరావు యాదవ్‌ను గౌతు శిరీష పరామర్శించారు. గాంధీనగర్‌లో ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట గురిటి సూర్యనారాయణ తదితరులున్నారు.


ధరలకు వ్యతిరేకంగా నేడు టీడీపీ ధర్నా

రాజాంరూరల్‌: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా శనివారం ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీ పేర్కొన్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు రాజాంలోని అంబేడ్కర్‌ కూడలి వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు రావాలని కోరారు. 


చాపర నుంచి పాదయాత్ర

 మెళియా పుట్టి: ధరల పెంపునకు వ్యతిరేకంగా శనివారం ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకరమణమూర్తి తెలిపారు. చాపర నుంచి మెళియాపుట్టి తహసీల్దార్‌ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని, కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని కోరారు. 

 

Updated Date - 2021-08-28T05:11:55+05:30 IST