రెడ్‌క్రాస్‌ సేవలు ప్రశంసనీయం

ABN , First Publish Date - 2021-05-09T04:59:29+05:30 IST

ఆపద సమయాల్లో రెడ్‌క్రాస్‌ సేవలు ప్రశంసనీయమని రాజాం పట్టణ, రూరల్‌సీఐలు పి.శ్రీనివాసరావు, నవీన్‌కుమార్‌ అన్నారు. శనివారం రాజాం సబ్‌ బ్రాంచ్‌ కార్యాలయంలో ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. రెడ్‌క్రాస్‌ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రెడ్‌క్రాస్‌ సేవలు ప్రశంసనీయం
కొవిడ్‌ ఆసుపత్రికి వాటర్‌, ఎనర్జీ డ్రింక్‌ బాటిళ్లను అందిస్తున్న దృశ్యం

రాజాం, మే 8: ఆపద సమయాల్లో రెడ్‌క్రాస్‌ సేవలు ప్రశంసనీయమని రాజాం పట్టణ, రూరల్‌సీఐలు  పి.శ్రీనివాసరావు, నవీన్‌కుమార్‌ అన్నారు. శనివారం రాజాం సబ్‌ బ్రాంచ్‌ కార్యాలయంలో ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. రెడ్‌క్రాస్‌ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్‌  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్త, ప్లాస్మా, నేత్ర, అన్నదానాలను ప్రోత్సహించడంతో పాటు  కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించడంలో వలంటీర్ల సేవలు అభినందనీయమన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమా దాల సమయంలో రెడ్‌క్రాస్‌ ముందుగా స్పందించి అన్ని రకాలుగా ఆదు కుంటోందని, దీనివల్ల ఎందరో బాధితులకు బాసట కలుగుతోందన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సబ్‌ బ్రాంచ్‌ అధ్యక్షుడు కొత్తా సాయిప్రశాంత్‌ కుమార్‌, పెంకి చైతన్యకుమార్‌, డీటీ రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు


కరోనా సమయంలో సేవలు భేష్‌

రాజాం రూరల్‌: కరోనా సమయంలో బాధితులకు సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని  పట్టణ సీఐ పి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం రాజాం పరిసర ప్రాంతాల్లోని కరోనా రోగులకు వాటర్‌, ఎనర్జీ డ్రింకు బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని భారత్‌ స్కౌట్‌, గైడ్స్‌ రెడ్‌క్రాస్‌, పట్టణ ఆర్యవైశ్య సంఘం, కొవిడ్‌-19 రిలీఫ్‌ బృంద సభ్యులు చేపట్టారు. కార్యక్రమంలో ఈ బృంద ప్రతినిధులు కొత్తా సాయిప్రశాంత్‌ కుమార్‌, పెంకి చైతన్యకుమార్‌, ఎం.నాగేశ్వరరావు, ఎస్‌.ఈశ్వరరావు, లక్ష్మణరావు, ఏపీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-05-09T04:59:29+05:30 IST