పది రోజుల్లో ఆలయ పునరుద్ధరణ పనుల పూర్తి

ABN , First Publish Date - 2021-10-25T05:41:23+05:30 IST

నీలమణి దుర్గ ఆలయ పునరుద్ధరణ పనులను పది రోజుల్లో పూర్తి చేయిస్తామని దేవదాయశాఖ కమిషనర్‌ ఎంవీ సూర్యకళ అన్నారు.

పది రోజుల్లో ఆలయ పునరుద్ధరణ పనుల పూర్తి
మాట్లాడుతున్న సూర్యకళ


పాతపట్నం: నీలమణి దుర్గ ఆలయ పునరుద్ధరణ పనులను పది రోజుల్లో పూర్తి చేయిస్తామని దేవదాయశాఖ కమిషనర్‌ ఎంవీ సూర్యకళ అన్నారు. ఆదివారం సా యంత్రం ఆమె నీలమణి దుర్గ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రహరీ, ప్రవేశ ద్వారం తొలగింపు పనులను పరిశీలించారు. అనంత రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయ ప్రహరీతో పాటు  ప్రవేశ ద్వారం, ధ్వజ స్తంభాన్ని ఆనుకుని ఉన్న స్లాబ్‌ నిర్మాణ పనులను పది రోజుల్లో పూర్తి చేస్తా మన్నారు.  సహాయ కమిషనర్‌ టి.అన్నపూర్ణ, ఆలయ కార్యనిర్వాహణాధికారి రాధా కృష్ణ, తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ ఉన్నారు. 


 


Updated Date - 2021-10-25T05:41:23+05:30 IST