సిక్కోలులో కుండపోత

ABN , First Publish Date - 2021-08-28T04:49:03+05:30 IST

సిక్కోలులో కుండపోత

సిక్కోలులో కుండపోత
పాలకొండ ఆంధ్రాబ్యాంక్‌ వద్ద చేరిన వర్షపు నీరు, భామిని భారీ వర్షం

గార మండలం తూలుగులో అత్యధికంగా 11.7 సెంటీమీటర్ల వర్షపాతం 

కొత్తూరులో అత్యల్పంగా 3.5మి.మీ. నమోదు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/పాలకొండ/భామిని, ఆగస్టు 27: సిక్కోలులో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గంటపాటు కుండపోతగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోనే అత్యధికంగా గార మండలం తూలుగులో వర్షం కురిసింది. అక్కడ  11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తూరు మండలంలో అత్యల్పంగా 3.5 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం ఎండతీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గరిష్టంగా 34.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టంగా మబ్బులు కమ్ముకుని.. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవడంతో.. వాతావరణం చల్లబడింది. సాయంత్రానికి.. కనిష్ట ఉష్ణోగ్రత  23.51 డిగ్రీలకు చేరుకుంది. గార, శ్రీకాకుళం, పాలకొండ, పోలాకి, ఎచ్చెర్ల, రాజాం, సీతంపేట, భామిని మండలాల్లో భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం నగరంలో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణమంతా రెండున్నర అడుగుల మేర వర్షపునీరు చేరింది. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. తూలుగులో పంట పొలాలు చెరువులను తలపించాయి. పాలకొండ పట్టణంలో ఆంధ్రాబ్యాంక్‌, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌, గారమ్మకాలనీతో పాటు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఆంధ్రాబ్యాంక్‌ కార్యాలయ ప్రాంగణంలోకి వర్షం నీరు చేరడంతో ఉద్యోగులు, ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. భామినిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో.. ప్రయాణికులు అవస్థలు పడ్డారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు  అవస్థలు పడ్డారు. శనివారం కూడా జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.  


జిల్లాలో శుక్రవారం నమోదైన వర్షపాతం(మిల్లీమీటర్లలో)

-------------------------------------------------------------------

మండలం ప్రాంతం వర్షపాతం

-------------------------------------------------------------------

గార తూలుగు 117.5

పాలకొండ పాలకొండ 82.0

గార కళింగపట్నం     79.5

గార బూరవల్లి 73.25

శ్రీకాకుళం బలగ         70.25

శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల      60.75

సీతంపేట సీతంపేట 57.25

పోలాకి పోలాకి         39.75

రాజాం మెయిన్‌ పంపుహౌస్‌ 39.0

ఎచ్చెర్ల తమ్మినాయుడుపేట 37.0

ఎచ్చెర్ల     ఎచ్చెర్ల 31.25

ఇచ్ఛాపురం ఏ.ఎస్‌.పేట 32.5

కోటబొమ్మాళి కోటబొమ్మాళి         33.0

రణస్థలం గరికపాలెం 31.5

ఇచ్ఛాపురం సయ్యద్‌ఖాన్‌ చెరువు         31.25

ఆమదాలవలస తిమ్మాపురం 30.25

పాతపట్నం        పాతపట్నం         32.25

రాజాం        గోపాలపురం         29.5

రణస్థలం         పైడిభీమవరం             25.0

పలాస         పలాస                 29.75

లావేరు లావేరు        23.75

రాజాం         డోలపేట          22.25

జి.సిగడాం         జి.సిగడాం         21.25

రాజాం          బొద్దాం         20.75

ఆమదాలవలస         మెట్టక్కివలస         19.25

పలాస             చినబందాం 19.25

సోంపేట             బాతుపురం 13.25

సరుబుజ్జిలి               విజయరాంపురం 12.0

బూర్జ               కొల్లివలస 10.5

హిరమండలం                గొట్టాబ్యారేజీ 27.0

పాతపట్నం                జగ్గిలిబొంతు 20.5

హిరమండలం                హిరమండలం         18.25

నరసన్నపేట                నరసన్నపేట 8.0

సంతబొమ్మాళి                సంతబొమ్మాళి         19.75

సారవకోట              సారవకోట 6.5

కవిటి              రాజపురం 7.5

వజ్రపుకొత్తూరు      వజ్రపుకొత్తూరు     5.5

కంచిలి               కంచిలి          5.5

మెళియాపుట్టి               మెళియాపుట్టి     5.0

పొందూరు               పొందూరు 4.75

కొత్తూరు         కొత్తూరు 3.5 

Updated Date - 2021-08-28T04:49:03+05:30 IST