టీడీపీ నేతల మానసికస్థితి దెబ్బతింది
ABN , First Publish Date - 2021-10-25T05:39:20+05:30 IST
వైసీపీ విజయాల పరంపరను తట్టుకోలేక టీడీపీ నేతల మానసికస్థితి దెబ్బతిందని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.

అడ్రస్‌లేని వారితో మాట్లాడించి సీఎంను రెచ్చగొడుతున్నారు
ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: వైసీపీ విజయాల పరంపరను తట్టుకోలేక టీడీపీ నేతల మానసికస్థితి దెబ్బతిందని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో ఆదివారం జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయతో పాటు వైసీపీ ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ.. టీడీపీ అడ్రస్‌లేని వారితో మాట్లాడించి సీఎం జగన్మోహన్రెడ్డిని రెచ్చగొడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులంతా గురుతర బాధ్యతతో పనిచేయాలని తెలిపా రు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. జడ్పీ చైర్పర్సన్ తన సొంత ఎజెం డాతో ముందుకుపోవా లని సూచించారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. మరో రెండున్నరేళ్ల పాలన మిగిలి ఉండడంతో సరికొత్త ప్రణాళికలతో ముందుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, గొర్లె కిరణ్‌కుమార్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, తదితరులు పాల్గొన్నారు.
: