మహనీయుల చరిత్ర స్ఫూర్తిదాయకం
ABN , First Publish Date - 2021-11-17T05:27:56+05:30 IST
జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం గ్రంథాలయ ఉద్యమకారులైన ఆచార్య రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి గ్రంథాలయ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు.
గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళి
జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం గ్రంథాలయ ఉద్యమకారులైన ఆచార్య రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి గ్రంథాలయ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. శ్రీకాకుళం నగరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు పాల్గొని మాట్లాడారు. మహనీయుల చరిత్ర స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఇచ్ఛాపురం శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులు అర్పించారు. విద్యార్థులకు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలపై వ్యక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలుగా జూనియర్స్ విభాగంలో విషామహాపతిరావు, స్వాతీ, దేవి, సీనియర్స్ విభాగంలో సంజన, కృష్ణవేణి, మౌనిక గెలుపొందారు. ఎచ్చెర్ల శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కె.కుమార్‌రాజా పాల్గొని మాట్లాడారు. పుస్తకాల ఆవశ్యకతను ప్రతిఒక్కరూ గుర్తించాలని తెలిపారు.
- ఆంధ్రజ్యోతి బృందం