దండుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: కళా వెంకటరావు

ABN , First Publish Date - 2021-11-24T04:13:11+05:30 IST

ప్రజల నుంచి డబ్బులు దండుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు విమర్శించారు. మంగళవారం పాలకొండలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఓటీఎస్‌ విధానంలో భాగంగా ఇళ్లను రిజిస్ర్టేషన్‌ చేసేందుకు రూ.10వేలు అడిగితే తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

దండుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: కళా వెంకటరావు
విలేకరులతో మాట్లాడుతున్న కళా వెంకటరావు

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు

పాలకొండ, నవంబరు 23: ప్రజల నుంచి డబ్బులు దండుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు విమర్శించారు. మంగళవారం పాలకొండలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఓటీఎస్‌ విధానంలో భాగంగా ఇళ్లను రిజిస్ర్టేషన్‌  చేసేందుకు రూ.10వేలు అడిగితే తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక్కో ఇంటి నుంచి రూ.10 వేల వంతున వసూలు చేసి రాష్ర ్టవ్యాప్తంగా రూ.57వేల కోట్లు దండుకునేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేసిందన్నారు.  ప్రభుత్వ ఆస్తులను అమ్మేసిన ముఖ్యమంత్రి ప్రజల సొంతిళ్లను కూడా అమ్మేందుకు సిద్ధపడడం విచారకరమన్నారు. ‘రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. రెండున్నరేళ్లుగా ప్రజలకు శాంతి లేదు. సమస్యలపై ప్రశ్నించే అధికారం లేదు. అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించిన తీరు కౌరవ సభను తలపించింది. రెండున్నరేళ్ల పాటు మూడు రాజధానులు అని చెప్పి.. ఇప్పుడు కొత్త నాటకమాడుతోంది’ అని కళా వెంకటరావు విమర్శించారు. అనంతరం  అనారోగ్యం  నుంచి కొలుకుంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడును, వీరఘట్టం సర్పంచ్‌ జామి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను కళా పరామర్శించారు. ఈ సందర్భంగా బాస్‌ఈజ్‌బ్యాక్‌ అనే బ్యానర్‌ను ఆవిష్కరించారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా తోటపల్లి కాలువల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు పల్లా కొండబాబు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, పట్టణ, మండలాధ్యక్షుడు గంటా సంతోష్‌, గండి రామినాయుడు  పాల్గొన్నారు.Updated Date - 2021-11-24T04:13:11+05:30 IST