తొలి విడత రసవత్తరం!

ABN , First Publish Date - 2021-02-06T05:22:08+05:30 IST

క్కుతోంది. తొలివిడత పోలింగ్‌ కు సంబంధించి బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. ఈ నెల 9న తొలివిడతలో 309 పంచాయతీలకు ఎన్నికలు

తొలి విడత రసవత్తరం!
 270 సర్పంచ్‌ స్థానాలకు 720 మంది పోటీ
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

‘స్థానిక’ ఎన్నికల సంగ్రామం వేడెక్కుతోంది. తొలివిడత పోలింగ్‌ కు సంబంధించి బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. ఈ నెల 9న తొలివిడతలో 309 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... ఇప్ప టికే 39 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన 270 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా.. 720 మంది బరిలో నిలి చారు. అలాగే 1,246 వార్డు మెంబర్‌ స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1666 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 3,569 మంది పోటీ పడుతున్నారు. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో గ్రామాల్లో ప్రచారాలు రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. బంధుత్వం... పలకరింపులు... కుశల ప్రశ్నలు.. మొదలయ్యాయి. సంక్షేమ పఽథకాలపై అధికార పార్టీ మద్దతు దారులు ప్రచారం సాగిస్తూ.. తమను గెలిపించాలని కోరుతున్నారు. ఇక టీడీపీ నేతలు కూడా ప్రభుత్వ లోపాలపై ప్రచారం చేస్తున్నారు. వైసీపీలో అసంతృప్తు లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయతాలు చేస్తున్నారు.

 నేడు  రెండో విడత నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన
రెండో విడత పోలింగ్‌ ఈ నెల 13న జరగనుంది. దీనికి సంబంధించి పది మం డలాల్లోని 278 పంచాయతీల్లో సర్పంచ్‌కు 1496 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు మెంబర్ల స్థానాలకు 5505 నామినేషన్లు పడ్డాయి. శుక్రవారం నామినేషన్లను అధికా రులు పరిశీలించారు. శనివారం నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిం చనున్నారు.


Updated Date - 2021-02-06T05:22:08+05:30 IST