ప్రభుత్వాలకు రోజులు దగ్గరపడ్డాయి

ABN , First Publish Date - 2021-07-13T05:27:50+05:30 IST

ప్రభుత్వాలకు రోజులు దగ్గరపడ్డాయి

ప్రభుత్వాలకు రోజులు దగ్గరపడ్డాయి
పొందూరులో సంతకాలు సేకరిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- డీసీసీ అధ్యక్షురాలు సత్యవతి

పొందూరు : ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని డీసీసీ అధ్యక్షు రాలు బొడ్డేపల్లి సత్యవతి తెలిపారు. సోమవారం పొందూరులో పెట్రోల్‌ ధరల పెంపుపై బంకుల వద్ద సంతకాల సేకరణ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు  ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ సేవాదల్‌ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి పైడి నాగభూషనరావు, పార్టీ మండలాధ్యక్షుడు పైడి రమణరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T05:27:50+05:30 IST