చెరువులో మునిగి బాలుడికి తీవ్ర అస్వస్థత

ABN , First Publish Date - 2021-07-25T05:15:41+05:30 IST

బలరాంపురం చెరువులో ప్రమాదవశాత్తు మునిగి బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పోలాకి మండ లం శివరాంపురానికి చెందిన కుసువర్ధన్‌ 4వ తరగతి చదువుతున్నాడు. పాఠశా లలకు సెలవు కావడంతో టెక్కలి మండలం బలరాంపురంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. శనివారం ఉదయం సరదాగా చెరువులోకి దిగి ప్రమాద వశాత్తు మునిగి పోవడంతో గమనించిన గ్రామస్థులు హుటాహుటిన రక్షించారు.

చెరువులో మునిగి బాలుడికి తీవ్ర అస్వస్థత

టెక్కలి రూరల్‌: బలరాంపురం చెరువులో ప్రమాదవశాత్తు మునిగి బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పోలాకి మండలం శివరాంపురానికి చెందిన కుసువర్ధన్‌ 4వ తరగతి చదువుతున్నాడు. పాఠశా లలకు సెలవు కావడంతో టెక్కలి మండలం బలరాంపురంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. శనివారం ఉదయం సరదాగా చెరువులోకి దిగి ప్రమాద వశాత్తు మునిగి పోవడంతో గమనించిన గ్రామస్థులు హుటాహుటిన రక్షించారు. చెరువులో మునిగిన సమయంలో నీరు ఎక్కువగా తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో ప్రథమ చికిత్స చేసి అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఢిల్లీశ్వరి, మోహనరావు ఆసుపత్రికి చేరుకున్నారు. 

Updated Date - 2021-07-25T05:15:41+05:30 IST