పట్టుబడిన నిందితుడు

ABN , First Publish Date - 2021-05-03T05:06:59+05:30 IST

సంతకవిటి మండలం కొండగూడెంలో నడిరోడ్డుపై బాలుడ్ని హత్యచేసిన నిందితుడు కొండపల్లి గోవిందరావు పోలీసులకు పట్టుబడ్డాడు.

పట్టుబడిన నిందితుడు
పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు గోవిందరావు

విచారణకు తరలిస్తుండగా ఆత్మహత్యాయత్నం

సంతకవిటి, మే 2: సంతకవిటి మండలం కొండగూడెంలో నడిరోడ్డుపై బాలుడ్ని హత్యచేసిన నిందితుడు కొండపల్లి గోవిందరావు పోలీసులకు పట్టుబడ్డాడు. కొండగూడెంలో శనివారం రాత్రి రెడ్డి దుర్గాప్రసాద్‌ అనే బాలుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గ్రామంలో అందరూ చూస్తుండగానే కత్తితో హత్యచేసిన గోవిందరావు పరారయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా.. ఆదివారం ఉదయం కృష్ణంవలస చెరువు సమీపంలో గోవిందరావు పట్టుబడ్డాడు. విచారణ నిమిత్తం ఆయనను పాలకొండ నుంచి రాజాం తరలిస్తుండగా మార్గమధ్యంలో పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందిస్తున్నారు. ఆదివారం కొండగూడెం గ్రామాన్ని డీఎస్పీ శ్రావణి సందర్శించారు. గ్రామస్థులు, బాధిత కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పెద్దల వివాహేతర సంబంధమే.. బాలుడి హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం దుర్గాప్రసాద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. 


Updated Date - 2021-05-03T05:06:59+05:30 IST