ఓవీపేటలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-10-28T06:08:02+05:30 IST
ఓవీపేటలో ఉద్రిక్తత

- జనసేన నాయకులను అడ్డుకున్న పోలీసులు
బూర్జ: మండలంలోని ఓవీపేటలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు జనసేన నాయకులను అడ్డుకు న్నారు. ఓవీపేట కోనేరు గట్టును జనసేన నాయకులు గ్రా మస్థుల సాయం అభి వృద్ధి చేసి గట్టుపై శివుని విగ్రహం, కుర్చీలు ఏర్పాటు చేశారు. వీటికోసం లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి రామ్మోహనరావు తెలిపారు.అయితే, ఈ అభివృద్ధి పనులను బుధవారం స్పీకర్‌తో ప్రారంభించేందుకు వైసీపీ నాయకులు ముందుకొచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు.. రామ్మోహనరావుకు సమాచారం అందజేశారు. దీంతో ఆయన అక్కడకు వెళ్లి తమ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ దశలో పోలీసులకు జనసేన నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జనసేన నాయకులు విరాళాలు వేసి కోనేరు గట్టును అభివృద్ధి చేస్తే స్పీకర్ ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. తమను పోలీసులు అడ్డుకోవడం తగదని రామ్మోహనరావు అన్నారు.