శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు

ABN , First Publish Date - 2021-11-23T05:42:54+05:30 IST

కార్తీకమాసం మూడో సోమవారం శివాయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.. శివోహం, శంభోశంకర, హరోహర మహాదేవ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలు శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వరాలయం, రావివలస ఎండల మల్లన్న, సంగాం సంగమేశ్వర ఆలయంతోపాటు వజ్రపుకొత్తూరు మండలం బెండి తదితర శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు
కవిటి: బెలగాంలో శివపార్వతులకు జలాభిషేకం కోసం పూర్ణకుంభాలతో నీటిని తీసుకు వస్తున్న మహిళలు

మూడో సోమవారం దారులన్నీ శివాలయాలవైపే..

గ్రామాల్లోని ఆలయాలకు తరలివచ్చిన భక్తులు

(ఆంధ్రజ్యోతి బృందం)

కార్తీకమాసం మూడో సోమవారం శివాయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.. శివోహం, శంభోశంకర, హరోహర మహాదేవ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలు శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వరాలయం, రావివలస ఎండల మల్లన్న, సంగాం సంగమేశ్వర ఆలయంతోపాటు వజ్రపుకొత్తూరు మండలం బెండి తదితర శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇతర ఆలయాల్లోనూ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు, దీపారాధన చేపట్టారు. ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ, భక్తులకు ఇబ్బంది లేకుండా దేవదాయ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రావివలస ఎండల మల్లన్న సన్నిధికి భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. 

 

Updated Date - 2021-11-23T05:42:54+05:30 IST