బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2021-06-22T05:03:21+05:30 IST

రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం క్యాంపస్‌ పరిధిలో నూతనంగా నియమితులైన బోధనా సిబ్బంది ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు అన్నారు. క్యాంపస్‌లో కొత్తగా చేరిన 53 మంది బోధనా సిబ్బందికి సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
మాట్లాడుతున్న ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు




- ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జగదీశ్వరరావు 

ఎచ్చెర్ల, జూన్‌ 21: రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం క్యాంపస్‌ పరిధిలో నూతనంగా నియమితులైన బోధనా సిబ్బంది ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు అన్నారు. క్యాంపస్‌లో కొత్తగా చేరిన 53 మంది బోధనా సిబ్బందికి సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు ఆదర్శంగా ఉంటూ, ఆర్జీయూకేటీ ఉన్నతిని మరింత పెంచేలా అంకిత భావంతో పనిచేయాలన్నారు. కృష్ణ యూనివర్సిటీ మాజీ వీసీ సుంకరి రామకృష్ణ మాట్లాడుతూ అధ్యాపకులు సమయపాలన పాటించాలని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఆర్జీయూకేటీ డీన్‌ ఆఫ్‌ అకడమిక్స్‌ ప్రొఫెసర్‌ డి.హరినారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్త్వం పెంచేలా బోధన సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఎల్‌డీ సుధాకర్‌ బాబు, శ్రీకాకుళం క్యాంపస్‌ డీన్‌ ఆఫ్‌ అకడమిక్‌ డాక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌, ఏవో కె.మోహన్‌కృష్ణ, సైకాలజీ కౌన్సిలర్‌ డాక్టర్‌ పద్మజా రాణి పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T05:03:21+05:30 IST