ఉపాధ్యాయుల నిరసన

ABN , First Publish Date - 2022-01-01T05:18:20+05:30 IST

కడప జిల్లాకు చెందిన ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణ రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా శుక్రవారం నరసన్నపేట మండలం ఉర్లాం, టెక్కలి మండలం పోలవరంలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అక్రమంగా సస్పెన్షన్‌కు గురిచేయడం దారుణమని వారన్నారు.

ఉపాధ్యాయుల నిరసన
టెక్కలి: పోలవరం పాఠశాల వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

నరసన్నపేట/టెక్కలి, డిసెంబరు 31: కడప జిల్లాకు చెందిన ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణ రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా శుక్రవారం నరసన్నపేట మండలం ఉర్లాం, టెక్కలి మండలం పోలవరంలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అక్రమంగా సస్పెన్షన్‌కు గురిచేయడం దారుణమని వారన్నారు. తక్షణం సస్పెన్షన్‌ను రద్దు చేయడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2022-01-01T05:18:20+05:30 IST