ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-10-07T05:54:04+05:30 IST

జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షల్లో వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు ప్రతిభ కరిచారు. వివిధ ర్యాంకులు సాధించి పాఠశాలలకు పేరు తీసుకువచ్చారు.

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ
ఎల్‌ఎన్‌పేట: యామినికి అందిస్తున్న ఉపాధ్యాయులు


యామినికి 107వ ర్యాంకు

కరకవలస(ఎల్‌.ఎన్‌.పేట), అక్టోబరు 6: ఎల్‌ఎన్‌పేట మండలంలోని కరకవలస జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి మెండ యామిని 107వ ర్యాంకు సాధించి నట్లు హెచ్‌ఎం బి.దీపక్‌కుమార్‌ తెలిపారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో 100 మార్కులకు గాను 86  సాధించినట్లు తెలిపారు. ప్రోత్సాహకంగా రూ.5 వేలు అందించారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు.  


శ్రావణికి 257..

కవిటి:  బొరివంక జడ్పీ పాఠశాల  విద్యార్థులు  ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో సత్తాచాటారు. కొత్తపల్లి శ్రావణి 82 మార్కులతో 257, బల్లెడ దేవిక 77 మార్కులతో 693 ర్యాంకులు సాధించినట్లు హెచ్‌ఎం ఎస్‌.రామకృష్ణ తెలిపారు. అలాగే మరో నలుగురికి మంచి ర్యాంకులు వచ్చాయన్నారు. విద్యార్థులను హెచ్‌ఎంతో పాటు సర్పంచ్‌ బి.శ్రీరాం ప్రసాద్‌, ఎంపీటీసీ సభ్యుడు డి.సంతోష్‌, తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు అభినందించారు. 


ఉదయ్‌కిరణ్‌కు 389.. 

నరసన్నపేట: ట్రిపుల్‌ ఐటీ ఫలితాల్లో నరసన్నపేట విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన సంబాన ఉదయ్‌కిరణ్‌ 389వ ర్యాంకు సాధించినట్లు హెచ్‌ఎం పి.వెంకట్రావు తెలిపారు. అలాగే శ్రీజ్ఞానజ్యోతి పాఠశాలకు చెందిన అలిగి చతుర్వేది కేటగిరీలో 188, చెంచల పవిత్ర 456వ ర్యాంకు, ఇట్రాజు సత్యనారాయణ 571 ర్యాంకు సాధించనట్లు ప్రిన్సిపాల్‌ వెలమల భాస్కరరావు, కరస్పాం డెంట్‌ బోర రామారావు తెలిపారు. విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.


భవానీకి 392.. 

హిరమండలం: హిరమండలం ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో మంచి ప్రతిభ కనబరిచారని హెచ్‌ఎం యూఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. బండి భవాని 392 ర్యాంకుతో పాటు మరో నలుగురు విద్యార్థు లు మంచి ర్యాంకులు సాధించారని పేర్కొంటూ వారిని అభినందించారు. 


లావణ్యకు 641...

జలుమూరు: ట్రిపుల్‌ ఐటీ  ప్రవేశ పరీక్షల్లో పెద్దదూగాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ధర్మాన లావణ్య 641వ ర్యాంకు సాధించింది. తండ్రి రామారావు ఆర్టీసి డ్రైవరుగా పనిచేస్తున్నారు. 77 మార్కులు సాధించి బీసీ కేటగిరీలో 146వ ర్యాంకు సాధించింది. లావణ్యను గ్రామస్థులు అభినందించారు.


సాగర్‌కు 938..

టెక్కలి: ట్రిపుల్‌ ఐటీ  ప్రవేశ పరీక్షలో సీతా పురం జడ్పీ హైస్కూల్‌కు చెందిన బి.సాగర్‌ 938వ ర్యాంకు సాధించినట్లు హెచ్‌ఎం సత్తారు వేణీకుమారి తెలిపారు. అలాగే మరో నలుగురు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని చెప్పారు. వీరిని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. 

 

Updated Date - 2021-10-07T05:54:04+05:30 IST