ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోండి
ABN , First Publish Date - 2021-11-22T05:13:48+05:30 IST
రహదారి ప్రయాణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్ ధరించాలని పాలకొండ డీఎస్పీ శ్రావణి అన్నారు. రేగిడి పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆదివారం ప్రపంచ సంస్మరణ దినోత్సవంలో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

పాలకొండ డీఎస్పీ శ్రావణి
రేగిడి, నవంబరు 21: రహదారి ప్రయాణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్ ధరించాలని పాలకొండ డీఎస్పీ శ్రావణి అన్నారు. రేగిడి పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆదివారం ప్రపంచ సంస్మరణ దినోత్సవంలో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రేగిడి, పాలకొండ, వీరఘట్టం, వంగరకు చెందిన ప్రమాద బాధిత కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎటువంటి సాయం, కేసుల సమాచారం, బీమా పరిహారానికి ఎటువంటి సహాయం కావాలన్నా పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీఐ శంకరరావు, ఎస్‌ఐ షేక్ మహమ్మద్ ఆలీ, పాలకొండ ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి, పాలకొండ, రేగిడి, వీరఘట్టం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.