టెక్కలి సీఐపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-02-02T05:09:50+05:30 IST

నరసన్నపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇప్పిలి తాత పట్ల టెక్కలి సీఐ నీలయ్య దురుసుగా ప్రవ ర్తించి స్టేషన్‌లో తెల్లవారుజాము వరకు ఉంచి కక్ష పూరితంగా వ్యవహ రించారని నరసన్నపేట బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక సివిల్‌ కోర్టు ఎదుట ధర్నా చేపట్టారు.

టెక్కలి సీఐపై చర్యలు తీసుకోండి
సివిల్‌ కోర్టు వద్ద ధర్నా చేస్తున్న న్యాయవాదులు


  బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదుల ధర్నా 

నరసన్నపేట, ఫిబ్రవరి 1: నరసన్నపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇప్పిలి తాత పట్ల  టెక్కలి సీఐ నీలయ్య దురుసుగా ప్రవ ర్తించి స్టేషన్‌లో తెల్లవారుజాము వరకు ఉంచి కక్ష పూరితంగా వ్యవహ రించారని నరసన్నపేట బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక సివిల్‌ కోర్టు ఎదుట ధర్నా చేపట్టారు. ఒక కేసు విషయంలో టెక్కలి పోలీసు స్టేషన్‌కు ఆదివారం వెళ్లిన ఇప్పిలి తాతను సోమవారం తెల్లవారుజాము వరకు ఉంచి చులకన భావంతో చూడడమే కాకుండా న్యాయవాది వృత్తిని అవమానించారని బార్‌ సభ్యులు ఆరోపించారు.  ఈ వ్యవహారంపై సీఐ నీలయ్యపై రాష్ట్ర ఎన్నికల సంఘం, హైకోర్టు దృష్టికి తీసుకువెళుతున్నామన్నారు. నీల య్యను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బార్‌ సభ్యులు ధర్మాన వెంకటరమణ, జీవీ రమణ, జామి కామే శ్వరరావు, రోణంకి కృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

 



 

Updated Date - 2021-02-02T05:09:50+05:30 IST