డీలరుపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-03-22T04:49:28+05:30 IST

రుకులను పక్కదారి పట్టిస్తున్న డీలరుపై చర్యలు తీసుకోవాలని కొత్తూరు గ్రామ స్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆందోళన చేపట్టి మాట్లాడుతూ.. కొత్తూరు, కైజోల గ్రామానికి చెంది న లబ్ధిదారులకు సరుకులను డీలరు లంబాడ మోహనరావు అందజేస్తున్నా రని చెప్పారు. గ్రామంలో మృతి చెందిన, పెళ్లి అయి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి సరుకులను ప్రభు త్వానికి డీలర్‌ ఇప్పటివరకు అప్పగించలేదని, వారి కుటుంబసభ్యులకు కూడా ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

డీలరుపై చర్యలు తీసుకోండి
ఆందోళన చేస్తున్న కొత్తూరు రేషన్‌ లబ్ధిదారులు

పలాస రూరల్‌, మార్చి 21: సరుకులను పక్కదారి పట్టిస్తున్న డీలరుపై చర్యలు తీసుకోవాలని కొత్తూరు గ్రామ స్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆందోళన చేపట్టి మాట్లాడుతూ.. కొత్తూరు, కైజోల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సరుకులను డీలరు లంబాడ మోహనరావు అందజేస్తున్నా రని చెప్పారు. గ్రామంలో మృతి చెందిన, పెళ్లి అయి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి సరుకులను ప్రభు త్వానికి డీలర్‌ ఇప్పటివరకు అప్పగించలేదని, వారి కుటుంబసభ్యులకు కూడా ఇవ్వకుండా  పక్కదారి పట్టిస్తున్నారని  ఆరోపించారు. 2013లో మృతి చెందిన గొర్లె అప్పారావు, 2015లో  మృతిచెందిన కవిటి అప్పలనర్సమ్మ పేర్లతో వస్తున్న సరుకులు  పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఫిబ్రవరి నుంచి వాహనాల ద్వారా సరుకులు ఇవ్వడంతో ఈ విషయం బయటపడిందని చెప్పారు. మృతి చెందిన లబ్ధి దారుల సరుకులు ఇన్నేళ్లుగా  ఏమవుతున్నాయో డీలర్‌ తెలియజేయాలని గ్రామస్థులు డి మాండ్‌ చేశారు. ఈ విషయమై గ్రామయువజన సంఘం ఆధ్వర్యంలో  కలెక్టర్‌, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కాగా ఈ విషయం తమ పరిశీలనకు వచ్చిందని సీఎస్‌డీటీ ఎన్‌.భాగ్యలక్ష్మి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ-పాస్‌ మిషన్‌లో వచ్చిన ప్రకారమే పంపిణీ చేస్తామని చెప్పారు. గ్రామానికి వెళ్లి  పరిశీలించి  తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 Updated Date - 2021-03-22T04:49:28+05:30 IST