దంపతులపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2021-05-03T05:05:32+05:30 IST

ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం.. ఘర్షణకు దారి తీసింది. విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి దంపతులపై కత్తితో దాడికి దిగాడు.

దంపతులపై కత్తితో దాడి
ఆసుపత్రిలో చికిత్స పొందతున్న దుర్గారావు

తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త

టెక్కలి రూరల్‌, మే 2: ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం.. ఘర్షణకు దారి తీసింది. విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి దంపతులపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడగా, భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. టెక్కలి ఆదిఆంధ్రావీధిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదిఆంధ్రావీధిలో నివాసముంటున్న దండాసి దుర్గారావు, అదే వీధికి చెందిన తోట వెంకి ఆదివారం సాయంత్రం వ్యక్తిగత విషయంపై గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. విచక్షణ కోల్పోయిన వెంకి కత్తితో దుర్గారావు కడుపులో పొడిచాడు. అడ్డుకోబోయిన దుర్గారావు భార్యపై కూడా  దాడి చేయడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దుర్గారావును హుటాహుటిన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కడుపులోకి కత్తి బలంగా దిగడంతో తీవ్ర రక్తస్రావమై పేగు బయటకు వచ్చేసింది. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంత రం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. దుర్గారావు ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు తెలిపారు. 

 

Updated Date - 2021-05-03T05:05:32+05:30 IST