సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా: ఎస్పీ అమిత్‌ బర్దర్‌

ABN , First Publish Date - 2021-02-06T05:09:38+05:30 IST

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ అన్నారు.

సమస్యాత్మక ప్రాంతాలపై  నిఘా: ఎస్పీ అమిత్‌ బర్దర్‌
మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌

టెక్కలి రూరల్‌: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ అన్నారు. స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాల యంలో టెక్కలి నియోజకవర్గం పరిధిలోని సీఐ, ఎస్‌ఐలతో శుక్రవారం సాయంత్రం సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. టెక్కలి మండలంలోని సమస్యాత్మక ప్రాంతాలైన తల గాం, రావివలస, చాకిపల్లి, పోలవరం, బూరగాం, పెద్ద రోకళ్ళపల్లి తదితర ప్రాంతాల్లో గొడవలకు, ఘర్షణలకు తావులేకుండా చూడాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈబీ ఏ ఎస్పీ శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, ఎస్‌ఐలు ఎన్‌.కామేశ్వరరావు, గోవిందరావు, మహ్మద్‌ యాసిన్‌, బాలరాజు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T05:09:38+05:30 IST