ఫెర్రో ఎల్లాయీస్‌ కార్మికులను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-07-26T04:53:57+05:30 IST

తమకు ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమ నుంచి రావాల్సిన బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరా రు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడలోని ఆయనను కలిసి వినతిపత్రం అందించారు.

ఫెర్రో ఎల్లాయీస్‌ కార్మికులను ఆదుకోండి
అచ్చెన్నాయుడుతో మాట్లాడుతున్న కార్మిక సంఘ నేతలు


టెక్కలి, జూలై 25: తమకు ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమ నుంచి రావాల్సిన బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరా రు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడలోని ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. ఫెర్రో ఎల్లా యీస్‌ పరిశ్రమను త్వరలో తెరవనున్న నేపథ్యంలో గతంలో కార్మికులకు బకాయి ఉన్న వేతనాలు, పీఎఫ్‌, ఇతర అలవెన్స్‌లు చెల్లించేటట్లు చూడాలని కార్మిక సంఘ నాయకులు పిట్ట గంగయ్య, భుజంగరావు, గున్నయ్య తదితరులు కోరారు. కార్మికులకు న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 


న్యాయం చేయాలని బీమామిత్రలు..

టెక్కలి రూరల్‌: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల్లో బీమామిత్రలుగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. సీఎం జగన్‌ రూ.3వేలు గౌరవ వేతనం అందిస్తామని, ప్రతి క్లయిమ్‌కు రూ.1000 ప్రోత్సాహకం ఇస్తామని చెప్పినా అమలు చేయలేదన్నారు. పైగా ఇటీవల తమను తొలగిస్తున్న ట్లు వైఎస్‌ఆర్‌ బీమా కాల్‌ సెంటర్‌ నుంచి సంబంధిత అధికారులు చెబుతున్నారన్నారు. అర్ధంతరంగా విధుల నుంచి తొలగించడంతో రోడ్డు న పడ్డామని, తమకు రావాల్సిన టీఏ, డీఏలు కూడా సుమారు ఏడు నెలలుగా ప్రభుత్వం చెల్లించ లేదని వారు వాపోయారు.  న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 


 తెలుగు యువత బలోపేతం చేయండి

టెక్కలి: జిల్లా తెలుగు యువతను బలోపేతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. ఇటీవల తెలుగుయువత అధ్యక్షుడిగా నియమితులైన దాసునాయుడు ఆదివారం నిమ్మాడలో అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద ర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ.. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, తెలు గు యువత ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని కోరారు.  తెలుగు యువత కార్యవర్గ నియామకాలు చేపట్టాలన్నారు.  

 

Updated Date - 2021-07-26T04:53:57+05:30 IST