విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-10-30T05:14:44+05:30 IST

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

- తోటి విద్యార్థినులు అనుమానించడమే కారణమా? 

వంగర: మడ్డువలస గురుకుల కళాశాలలో ఇంటర్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువతున్న ఓ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రిన్సిపాల్‌ ఉష తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాము దాచుకున్న డబ్బులు దొంగిలించావంటూ తోటి విద్యార్థినులు ఆమెను వేధించడంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందన్నారు. విద్యార్థినుల మధ్య జరిగిన ఈ విషయంలో వివాదం జరిగిన వెంటన మరుగుదొడ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఫినాయిల్‌ తాగి అపస్మారక స్థితికి చేరుకుందన్నారు. వెంటనే ఆమెను రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశామన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని, శనివారం వరకు ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు సూచించారని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేశామని చెప్పారు. ఈ విషయమై ఎస్‌ఐ దేవానంద్‌ వద్ద ప్రస్తావించగా తన దృష్టికి రాలేదని చెప్పారు. 

Updated Date - 2021-10-30T05:14:44+05:30 IST