బ్లడ్‌ కేన్సర్‌తో విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-08-21T05:44:47+05:30 IST

బ్లడ్‌ కేన్సర్‌తో విద్యార్థి మృతి

బ్లడ్‌ కేన్సర్‌తో విద్యార్థి మృతి

భామిని : భామిని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న కనుపూరు ఉదయ్‌కుమార్‌ (17) బ్లడ్‌ కేన్సర్‌ బాధపడుతూ విశాఖలోని ఓ ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. నెల రోజుల కిందట జ్వరం రావడంతో చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రక్త కణాలు తగ్గిపోయాయని గుర్తించిన వైద్యులు అవసరమైన చికిత్స అందించారు. ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో 15 రోజుల కిందట ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట ఉదయ్‌కుమార్‌ మళ్లీ అనారోగ్యానికి గురవడంతో  తల్లిదండ్రులు కోటయ్య, సావిత్రమ్మ రిమ్స్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా బ్లడ్‌ కేన్సర్‌ వైద్యులు నిర్ధారించి మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. గురువారం విశాఖలోని ఓ ఆసుపతిరలో చికిత్స పొందుతుండగా శుక్రవారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఉదయ్‌కుమార్‌ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2021-08-21T05:44:47+05:30 IST