పార్టీ పటిష్టతకు కృషి చేయండి: కళా

ABN , First Publish Date - 2021-07-13T05:25:43+05:30 IST

పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు సూచించారు.

పార్టీ పటిష్టతకు కృషి చేయండి: కళా
కళాను అభినందిస్తున్న చీపురుపల్లి పార్టీ నాయకులు

రాజాం, జూలై 12: పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు సూచించారు. విజ యనగరం జిల్లా చీపురుపల్లి, ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని జి.సిగడాం, లావేరు మండలాలకు చెందిన నాయకులు రౌతు కామి నాయుడు, కలిళెట్టి సత్యనారాయణ, గవిడి నాగరాజు, సాహు, ఈశ్వరరావు, లక్ష్మణరావు తదితరులు సోమవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా  ఆయా మండలాల్లోని పరిస్థితులను కళా వెంకటరావు వారితో చర్చించారు. ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, భవిష్యత్‌ అంతా  టీడీపీదేనని అన్నారు. 

 

Updated Date - 2021-07-13T05:25:43+05:30 IST