నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2021-05-09T05:00:55+05:30 IST
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి హెచ్చరిం చారు, శనివారం రాత్రి పాలకొండ రోడ్డులో అంబేద్కర్ కూడలిలో కర్ఫ్యూ అమలును పరిశీలించారు.

పాలకొండ డీఎస్పీ శ్రావణి
రాజాం: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి హెచ్చరిం చారు, శనివారం రాత్రి పాలకొండ రోడ్డులో అంబేద్కర్ కూడలిలో కర్ఫ్యూ అమలును పరిశీలించారు. వాహనాలతో వచ్చిన వారిని నిలిపి అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. 144వ సెక్షన్ అమల్లో ఉన్నందున బయట తిరిగితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలులో ఉంటుందని, దుకాణాలు తెరవవద్దని, ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. మాంసం, చేపలు విక్రయాలు కూడా చేపట్టవద్దన్నారు. ఆమెతో పాటు పట్టణ సీఐ పి.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.