గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు

ABN , First Publish Date - 2021-10-07T05:55:28+05:30 IST

రాజాంలో తడి, పొడి చెత్తలను సేకరించి ఎరువుల తయారీకి గాను గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి ఎటువంటి స్థల సమస్య లేనందున త్వరితగతిన చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం సాయంత్రం గాయత్రీ కాలనీలో స్థలాన్ని పరిశీలించారు.

గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు
స్థల పరిశీలన చేసి అధికారులతో మాట్లాడుతున్న జేసీ సుమిత్‌ కుమార్‌

 జేసీ సుమిత్‌కుమార్‌

రాజాం, అక్టోబరు 6: రాజాంలో తడి, పొడి చెత్తలను సేకరించి ఎరువుల తయారీకి గాను గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి ఎటువంటి స్థల సమస్య లేనందున త్వరితగతిన చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం సాయంత్రం గాయత్రీ కాలనీలో స్థలాన్ని పరిశీలించారు. తడి, పొడి చెత్తను, ప్లాస్టిక్‌ వస్తువులను కూడా వేరుచేసి చెత్త సేకరణ కేంద్రాలకు తరలిస్తున్నట్లు కమిషనర్‌ వైడి సర్వేశ్వరరావు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్ర మం లో మునిసిపల్‌ మేనేజర్‌ ఎంవీ నాగరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టరు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-07T05:55:28+05:30 IST