‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమా సందడి

ABN , First Publish Date - 2021-08-28T05:03:33+05:30 IST

శ్రీదేవి సోడాసెంటర్‌ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా స్థానిక వెంకటేశ్వర థియేటర్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు కేక్‌ కట్‌ చేసి, అభి మానులతో కలిసి సినిమాను తిలకించారు.

‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమా సందడి
కేక్‌ కట్‌ చేస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు

పలాస/కాశీబుగ్గ : శ్రీదేవి సోడాసెంటర్‌ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా స్థానిక వెంకటేశ్వర థియేటర్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు కేక్‌ కట్‌ చేసి, అభిమానులతో కలిసి సినిమాను తిలకించారు. కాగా ఈ సినిమాకు పలాస మండలం కాంట్రగడ గ్రామానికి చెం దిన కద్దాల కరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. గతంలో ఈయన దర్శకత్వంలో పలాస-1979 సినిమా తీశారు. కార్యక్రమంలో నటుడు గార రాజారావు, మాజీ చైర్మన్‌ కోత పూర్ణచంద్రరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పైల వెంకటరావు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-08-28T05:03:33+05:30 IST