‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ యూనిట్‌ సందడి

ABN , First Publish Date - 2021-08-29T04:51:48+05:30 IST

ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం 1975’ చిత్రం యూనిట్‌ సభ్యులు నగరంలోని ఎంజీబీ మాల్‌లో శనివారం రాత్రి సందడి చేశారు. ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వారు నగరానికి వచ్చారు.

‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ యూనిట్‌ సందడి
ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం 1975 చిత్రం హీరో కిరణ్‌ అబ్బవరం

నెల్లూరు (సాంస్కృతికం), ఆగస్టు 28 : ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం 1975’ చిత్రం యూనిట్‌ సభ్యులు నగరంలోని ఎంజీబీ మాల్‌లో శనివారం రాత్రి సందడి చేశారు. ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వారు నగరానికి వచ్చారు. ఆ చిత్రం హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ తనకు నెల్లూరుతో ఎంతో అనుబంధం ఉందని తీపి గుర్తులను ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నా నెల్లూరు అంటే ఇష్టం కాబట్టి కాసేపు మీతో ముచ్చటించాలని వచ్చానన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోందనీ,  అందరూ థియేటర్‌లో చూసి ఆనందించాలనీ కోరారు. అనంతరం సభ్యులతో కలిసి సినిమాలోని పాటలు, డైలాగులు చెప్పి అలరించారు.

Updated Date - 2021-08-29T04:51:48+05:30 IST